Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 17:38PM

Kutch: కచ్‌లో భూకంపం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్‌లో ఆదివారం ఉదయం 8.38 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై  దీని తీవ్రత 3.1గా నమోదైంది. భూమికి 9.3కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గాంధీనగర్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజికల్ రీసెర్చ్(ISR) చెప్పింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని కచ్ విపత్తు నిర్వహణ కేంద్రం అధికారులు తెలిపారు. అతి తీవ్ర భూకంప కేంద్రంలో కచ్ ఉండటంతో తరచుగా భూకంపాలు వస్తుంటాయని వివరించారు. ఈ ఏడాది ఆగస్టు 21న 4.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని వెల్లడించారు. కచ్‌లో 2001లో సంభవించిన భూకంపం గత రెండు శతాబ్దాల్లోనే మూడో పెద్దది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement