లంక వన్డే కెప్టెన్‌ పెరీరా

ABN , First Publish Date - 2021-05-13T06:03:46+05:30 IST

బంగ్లాదేశ్‌తో జరిగే సిరీ్‌సకు శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా ఎంపియ్యాడు. వైస్‌ కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ వ్యవహరించనున్నట్టు శ్రీలంక క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ...

లంక వన్డే కెప్టెన్‌ పెరీరా

  • కరుణరత్నే, మాథ్యూ్‌సకు ఉద్వాసన

కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగే సిరీ్‌సకు శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా ఎంపియ్యాడు. వైస్‌ కెప్టెన్‌గా కుశాల్‌ మెండిస్‌ వ్యవహరించనున్నట్టు శ్రీలంక క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ తెలిపింది. కాగా, ప్రస్తుత కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నేకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌, టాపార్డర్‌ బ్యాట్స్‌మన్‌ లాహిరు తిరుమన్నె, వికెట్‌ కీపర్‌ దినేష్‌ చాందిమల్‌పై కూడా వేటు వేశారు. పేసర్‌ చమిక కరుణరత్నే, బ్యాట్స్‌మన్‌ షిరన్‌ ఫెర్నాండోకు  తొలిసారి జట్టులో చోటు దక్కింది. 


Updated Date - 2021-05-13T06:03:46+05:30 IST