మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కురుప్’. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అయింది. ఇటీవల విడుదలైన ‘కురుప్’ భారీ సక్సెస్‌ను అందుకుంది. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందులో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ హీరోయిన్గా నటించింది. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో ఈరోజు నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.