కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ఇన్ ఫ్లో 60,604 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 58,864 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,631 అడుగులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం 96.823 టీఎంసీలుగా ఉంది.