కర్నూలు: సుంకేసుల ప్రాజెక్ట్‌కు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి చేరుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల ఇన్‌ఫ్లో 31,700 కాగా, ఔట్ ఫ్లో 29,600 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సుంకేసుల నుంచి 2,100 క్యూసెక్కుల నీరును కేసీ కెనాల్ కు విడుదల చేశారు.