Abn logo
Sep 20 2021 @ 08:03AM

AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ ఫ్లో 2.28 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులుగా కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తి నీటినిల్వ 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 212 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption