Abn logo
Aug 23 2021 @ 08:00AM

Srisailam ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ఇన్‌ఫ్లో 25,368 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 38,478 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్ధ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుత నిల్వ 178 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.