Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-02T13:40:19+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వస్తుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల...

Kurnool: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వస్తుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో: 4,41,914 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో:  4,35,525 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 883.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ: 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం: 208.7210 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2021-08-02T13:40:19+05:30 IST