కర్నూలు: శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేసి ఉగాధి మహోత్సవాలను ఈఓ లవన్న, చైర్మన్ చక్రపాణి రెడ్డి, అర్చకులు, వేదపండితులు ప్రారంభించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధులలో బృంగివాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. మహాలక్ష్మీ అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది.
ఇవి కూడా చదవండి