కర్నూలు: నల్లమల అటవీప్రాంతం శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం రేగింది. నాగలూటి దగ్గర నడకదారిలో వస్తున్న శివభక్తులను పెద్దపులి వెంబడించింది. ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు. ఓ శివభక్తుడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు భక్తులను రక్షించి బస్సుల్లో శ్రీశైలంకు పంపారు.