ఏపీలో పంచర్ షాపునకు రూ.57 వేల కరెంట్ బిల్లు

ABN , First Publish Date - 2021-09-13T22:57:02+05:30 IST

ఏపీలో పంచర్ షాపునకు రూ.57 వేల కరెంట్ బిల్లు

ఏపీలో పంచర్ షాపునకు రూ.57 వేల కరెంట్ బిల్లు

అమరావతి: ఏపీలో కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. చిన్నపాటి గుడెసులు, షాపులకు దిమ్మ తిరిగే రేంజ్‌లో బిల్లులు వస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ పంక్చర్ షాపుకు రూ.57 వేలు కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో బిల్లు చూసిన షాపు యజమానికి గుండెపోటు వచ్చినంత పని అయింది. వెంకన్నబావి వీధిలో బసవ అనే వ్యక్తి పంచర్ షాపు నిర్వహిస్తున్నారు. చిన్న పంచర్ షాపునకు రూ.57,965 బిల్లు వచ్చినట్లు బసవ తెలిపారు. ఆగస్టు నెలలో కేవలం రూ.100 వచ్చిందని కానీ ఈ నెల ఒకే సారి వేలల్లో కరెంట్ బిల్లు రావడంపై బాధితుడు గుండెలు బాదుకుంటున్నారు. కరెంట్ ఆఫీసుకు వెళ్లే అధికారులు ఎవరూ లేరని తెలిపారు. 



Updated Date - 2021-09-13T22:57:02+05:30 IST