దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-11-30T05:58:22+05:30 IST

వైసీపీ హయాంలో అమాయకులపై దాడులు పెరిగిపోయాయని, ఈ దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని గొర్రెల పెంపకందా రుల ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ఆరోపించా రు.

దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

  1. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ 


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 29: వైసీపీ హయాంలో అమాయకులపై దాడులు పెరిగిపోయాయని, ఈ దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని గొర్రెల పెంపకందా రుల ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ఆరోపించా రు. ఆదివారం కర్నూలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యాన్ని చూపుతున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం, డి.ముప్పవరం గ్రామంలో పొలం యజమాని దాడిలో అమాయకుడైన గొర్రెల కాపరి చనిపోయాడని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కోరారు. గొర్రెల కాపరి కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షల పరిహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. గొర్రెలు మేపుకొనేందుకు నిరూపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మురళీమోహన్‌, రంగనాథ్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:58:22+05:30 IST