Abn logo
May 14 2021 @ 13:04PM

అంబులెన్స్‌లకు అనుమతివ్వాలని కోరిన కర్నూలు ఎమ్మెల్యే

కర్నూలు: తెలంగాణలోకి ఏపీకి చెందిన అంబులెన్స్‌ను అనుమతించకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పందించారు. వెంటనే జిల్లాలోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే... తెలంగాణ పోలీసులతో మాట్టాడారు. పర్మిషన్ ఉన్న అంబులెన్స్‌లను తెలంగాణలోకి పంపించాలని కోరారు. అలాగే హైదరాబాద్ హాస్పిటల్‌లలో చేరేందుకు పర్మిషన్ లేని రోగులను ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స చేయాల్సిందిగా జీజీహెచ్ అధికారులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సూచించారు. 

Advertisement