Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూలు జిల్లాలో రేపు, ఎల్లుండి కేఆర్ఎంబీ టీమ్ పర్యటన

కర్నూలు: జిల్లాలో రేపు, ఎల్లుండి కేఆర్ఎంబీ బృందం పర్యటించనున్నారు. సోమవారం మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్‌ను సందర్శించనున్నారు. రాత్రికి శ్రీశైలంలో బసచేయనున్నారు. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనున్నారు. కేఆర్ఎంబీ టీమ్‌లో మొత్తం పదిమంది సభ్యులున్నారు. ఈ కమిటీలో ఏపీ తెలంగాణ, జెన్‌కో అధికారులు ఉన్నారు. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో కేఆర్ఎంబీ టీమ్ పర్యటించనుంది.

Advertisement
Advertisement