Advertisement
Advertisement
Abn logo
Advertisement

కర్నూల్‌లో భారీగా నగదు పట్టివేత..

కర్నూలు: శివారు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కారులో తీసుకువెళుతున్న రూ. 75 లక్షల నగదును స్పెషల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్‌కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి నగదు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా ఆ కారు వెళ్లిపోయింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. సోదా చేయగా నగదు బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement