కర్నూలు జిల్లా: కోడుమూరు వైసీపీలో రాజకీయాలు రచ్చకెక్కాయి. గూడూరు మండలం, కె.నాగరాపురంలో ఎంపీపీ పదవి కోసం ఎంపీటీసీ రాజమ్మ ధర్నాకు దిగారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఎంపీపీ పదవిపై హామీ ఇచ్చి మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీటి పర్యంతమైంది. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేసినా తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ వచ్చి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించబోమని రాజమ్మ స్పష్టం చేసింది.