నంద్యాలలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

ABN , First Publish Date - 2021-09-15T17:32:59+05:30 IST

కర్నూలు జిల్లా: నంద్యాలలో గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు.

నంద్యాలలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

కర్నూలు జిల్లా: నంద్యాలలో గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి వాహనాన్ని ఓ యువకుడు మద్యం మత్తులో అడ్డుకున్నాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కారు దిగి అతనిని చితకబాదారు. శిల్ప రవి కారును అడ్డుకుని అద్దాలను చేతులతో కొట్టే ప్రయత్నం చేయడంతో దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన నంద్యాల ఫరూక్‌నగర్‌లో చోటు చేసుకుంది. యువకుడు అతిగా తాగి ఎమ్మెల్యే వాహనంపై దాడి చేయడానికి ప్రయత్నించాడని.. అందుకే అడ్డుకున్నామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు. దాడిలో గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-09-15T17:32:59+05:30 IST