Kurnool జిల్లా: ఆలూరులో భారీ వర్షం.. కల్లివంక వాగులో కొట్టుకుపోయిన Car..

ABN , First Publish Date - 2022-06-06T16:29:57+05:30 IST

Kurnool జిల్లా: ఆలూరు (Aluru)లో రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

Kurnool జిల్లా: ఆలూరులో భారీ వర్షం.. కల్లివంక వాగులో కొట్టుకుపోయిన Car..

Kurnool జిల్లా: ఆలూరు (Aluru)లో రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కల్లివంక (Kallivanka) వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ఓ కారు ప్రయత్నించగా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గుంతకల్లు నుంచి ఆలూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వాగులో కారు కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కారు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడం, నీటి ఉధృతి పెరుగుతుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం కారు కోసం గాలింపు చర్యలు చేపడతమని పోలీసులు తెలిపారు. వరద ఉధృతి కారణంగా ఆలూరు-గుంతకల్లు మధ్య రాక పోకలు నిలిపివేశారు. కాగా కర్నాటకకు చెందిన కారుగా గుర్తించారు. కారులో ఎంతమంది ఉన్నారన్నది తెలియరాలేదు. 

Updated Date - 2022-06-06T16:29:57+05:30 IST