AP News: కర్నూల్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ

ABN , First Publish Date - 2022-09-28T19:29:50+05:30 IST

కర్నూలు జిల్లాలో ప్రోటోకాల్ (Protocol) ఉల్లంఘన వివాదం ముదురుతోంది.

AP News: కర్నూల్ జిల్లాలో ప్రోటోకాల్ రగడ

కర్నూలు (Kurnool): జిల్లాలో ప్రోటోకాల్ (Protocol) ఉల్లంఘన వివాదం ముదురుతోంది. ప్రభుత్వ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్లు (Municipal Commissioners) ఏకంగా మంత్రులనే దూరం పెట్టడంపై జిల్లా కలెక్టర్ (Dist. Collector) ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలంటూ ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు (Noties) జారీ చేశారు. ఈ నెల 23న ఎమ్మిగనూరు, ఆదోనిలో టిడ్కో గృహాలను మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Rajendranadh Reddy), గుమ్మనూరు జయరామ్‌ (Gummanuru Jayaram)ను ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇద్దరు కమిషన్లకు నోటీసులు జారీ చేశారు. ప్రొటోకాల్ మర్యాదలు పాటించనందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 


అలాగే ఇద్దరు కమిషనర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్‌కు కలెక్టర్ కార్యాలయం ఒక కాపీని పంపింది. వారితో పాటు టిడ్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజశేఖర్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంత్రులను ఆహ్వానించకుండా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన ఇద్దరు కమిషనర్లు, ఎస్ఈపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? లేఖ వారిచ్చే వివరణతో సంతృప్తి చెంది క్షమించి వదిలేస్తారా? అన్న విషయం రెండు రోజుల్లో తేలిపోనుంది.

Updated Date - 2022-09-28T19:29:50+05:30 IST