Abn logo
Jun 23 2021 @ 13:17PM

కర్నూలు జిల్లాలో దారుణం

కర్నూలు జిల్లా: కడక్‌పూరలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు ప్రతాప్, హేమలత.. కుమారుడు జయంత్, కుమార్తె రిషితగా పోలీసులు గుర్తించారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.