Abn logo
Apr 11 2021 @ 10:55AM

నలుగురి ప్రాణాలు కాపాడిన దిశా యాప్

కర్నూలు: జిల్లాలో దిశా యాప్ నలుగురి  ప్రాణాలు కాపాడింది. మహానంది మండలం, నల్లమల అడవిలో ఆత్మహత్యకు యత్నించిన తల్లీ, ముగ్గురు పిల్లల ప్రాణాలు నిలిపేలా చేసింది. దిశా యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లీ, పిల్లలను కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఆ కుటుంబానికి రూ. 50వేల నగదు సహాయం అందించారు.

Advertisement
Advertisement
Advertisement