AP: బనగానపల్లె ఎంపీడీవో సస్పెన్షన్

ABN , First Publish Date - 2021-11-26T16:28:23+05:30 IST

బనగానపల్లె ఎంపీడీఓ నాగ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

AP: బనగానపల్లె ఎంపీడీవో సస్పెన్షన్

కర్నూలు: బనగానపల్లె ఎంపీడీఓ నాగ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎర్రగుడి గ్రామ పంచాయితీ ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఉపసర్పంచ్ ఎన్నికల విషయంలో  ఎన్నికల కమిషన్‌ను ఎంపీడీఓ నాగప్రసాద్  తప్పదోవ పట్టించారు. ఈ నేపథ్యంల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎంపీడీవో నాగ ప్రసాద్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-11-26T16:28:23+05:30 IST