Kurnool: కొక్కెపీఠం నిర్మాణంపై ముదురుతున్న వివాదం

ABN , First Publish Date - 2021-12-16T15:02:08+05:30 IST

జిల్లాలోని దిగువ అహోబిలం మఠంలో కొక్కెపీఠం నిర్మాణంపై వివాదం ముదురుతోంది.

Kurnool: కొక్కెపీఠం నిర్మాణంపై ముదురుతున్న వివాదం

కర్నూలు: జిల్లాలోని దిగువ అహోబిలం మఠంలో కొక్కెపీఠం నిర్మాణంపై వివాదం ముదురుతోంది. కొక్కెపీఠం నిర్మిస్తే నిరహార దీక్ష చేస్తానని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి హెచ్చరించారు. నవ అహోబిలంలో పీఠాలు ఏర్పాటు చేసేందుకు గతంలోనే స్థలాలు తీసి ఉంచామని... కానీ దిగువ అహోబిలంలో వేరే మఠాలకు చెందిన వారు పీఠాలను నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని తెలిపారు. కొక్కే పీఠం వద్దని చెబితే తమ ప్రత్యర్థి కుటుంబీకులే తమకు మద్దతు తెలిపారన్నారు. కానీ తమ కుటుంబీకులే కొక్కే పీఠం నిర్మాణానికి మద్దతుగా నిలబడటం బాధకరమని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. 

Updated Date - 2021-12-16T15:02:08+05:30 IST