AP: పాము కాటుతో 108 అంబులెన్స్ డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2021-09-29T16:33:26+05:30 IST

పాముకాటుతో అవుకుకు చెందిన శ్రీకాంత్(28) మృతి చెందారు. శ్రీకాంత్ 108 అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

AP: పాము కాటుతో 108 అంబులెన్స్ డ్రైవర్ మృతి

కర్నూలు: పాముకాటుతో అవుకుకు చెందిన శ్రీకాంత్(28)  మృతి చెందాడు. శ్రీకాంత్ 108 అంబులెన్స్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో భాగంగా కర్నూలు నుండి తిరిగి వస్తుండగా టాయిలెట్ కోసం నన్నూరు వద్ద శ్రీకాంత్ అంబులెన్స్‌ను ఆపాడు. ఈ క్రమంలో అనుకోకుండా శ్రీకాంత్‌ను పాము కాటు వేసింది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గ మధ్యలో మృతి చెందాడు. 

Updated Date - 2021-09-29T16:33:26+05:30 IST