కర్నూలు: దేవనకొండ మండలం తెర్నేకల్‌లో అతిసార ప్రబలింది. దీంతో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా ఒకరు మృతి చెందారు. కర్నూలు, కోడుమూరు, ఆదోని ఆస్పత్రులలో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అతిసారం విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆందోళనకు దిగారు.