ఆకట్టుకుంటున్న ‘కురింజి’ పూలు

ABN , First Publish Date - 2021-10-27T16:03:52+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీకి వస్తున్న సందర్శకులను బొటానికల్‌ గార్డెన్‌లో విరబూసిన కురింజి పూలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ బొటానికల్‌ గార్డెన్‌ పలు అరుదైన రకాల పూలమొక్కలు సంరక్షిస్తు

ఆకట్టుకుంటున్న ‘కురింజి’ పూలు

పెరంబూర్‌(Chennai): ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటీకి వస్తున్న సందర్శకులను బొటానికల్‌ గార్డెన్‌లో విరబూసిన కురింజి పూలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వ బొటానికల్‌ గార్డెన్‌ పలు అరుదైన రకాల పూలమొక్కలు సంరక్షిస్తున్నారు. ఇటాలియన్‌ పార్క్‌లో రాతి జలపాతం వలే రూపొందించిన ప్రాంతంలో ఈ కురింజి మొక్కలను సంరక్షిస్తున్నారు. స్ట్రోబిలాంథస్‌ సోసిపినస్‌ జాతికి చెందిన మొదళ్లలాగా కనిపించే ఈ మొక్కలకు మూడేళ్లకు ఒకసారి పూలు పూస్తాయి. ఆ ప్రకారం మూడేళ్ల తర్వాత ప్రస్తుతం ఈ కురింజి పూలు పూసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - 2021-10-27T16:03:52+05:30 IST