కురిచేడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్

ABN , First Publish Date - 2020-08-04T00:33:36+05:30 IST

కురిచేడు ఘటనపై సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిట్ అధికారులు మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఓఎస్డీ చౌడేశ్వరీ నేతృత్వంలో విచారణ...

కురిచేడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్

ప్రకాశం : కురిచేడు ఘటనపై సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిట్ అధికారులు మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఓఎస్డీ చౌడేశ్వరీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కురిచేడు ప్రాంతంలోని మెడికల్ షాపులు, నర్సరావుపేటలో శానిటైజర్ తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయా కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించారు. కురిచేడులో మృతులు ఉపయోగించిన శానిటైజర్ శాంపిల్స్ సేకరించారు. కర్ణాటకలోని ఓ సెంట్రల్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపారు. తమిళనాడు లోని చంగల్ పట్టు, సూల్లూరులో జరిగిన ఘటనలో అక్కడి మృతుల తీరు, పరిస్థితులు, పోలీస్ అధికారుల విచారణ వైనంపై సిట్ అధికారుల ఆరా తీస్తున్నారు. కాగా, విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిట్ బృందానికి పూర్తి అధికారులను ఇస్తూ ఎస్పీ సిద్దార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-08-04T00:33:36+05:30 IST