తుది దశకు చేరుకున్న కురిచేడు శానిటైజర్ మృతి ఘటన కేసు

ABN , First Publish Date - 2020-08-08T17:24:13+05:30 IST

ప్రకాశం: కురిచేడు శానిటైజర్ మృతి ఘటన కేసు తుది దశకు చేరుకుంది. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ కంపెనీ నిర్వాహకులు

తుది దశకు చేరుకున్న కురిచేడు శానిటైజర్ మృతి ఘటన కేసు

ప్రకాశం: కురిచేడు శానిటైజర్ మృతి ఘటన కేసు తుది దశకు చేరుకుంది. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసి పర్ఫెక్ట్ కంపెనీ నిర్వాహకులు శానిటైజర్ అమ్మకాలు చేపట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. మూడవ తరగతి చదివిన వ్యక్తి శానిటైజర్ల తయారీ, అమ్మకాలు చేస్తున్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ శానిటైజర్ల దందా నడుస్తోంది. శానిటైజర్ల తయారీలో వాడే ముడి పదార్థాలు అన్నీ ప్రాణాంతకరమేనన్నారు. మిథైల్ ఆల్కహాల్ బదులుగా మిథైల్ క్లోరైడ్ వాడినట్లుగా గుర్తించారు. 


పోలీసుల అదుపులో పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ నిర్వాహకుడు, సిబ్బంది ఉన్నారు. నకిలీ శానిటైజర్ తయారీకి వినియోగించే కెమికల్స్, తయారు చేసిన కొన్ని శానిటైజర్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని హైదరాబాద్ నుంచి కురిచేడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏజంట్ల ద్వారా కురిచేడు, దర్శిలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. కురిచేడు, దర్శిలలో ప్రభుత్వం అనుమతులు లేని శానిటైజర్లను మెడికల్ షాపుల నిర్వాహకులు దాచేశారు. కురిచేడులో శానిటైజర్ తయారీ, అమ్మకాలు కుటీర పరిశ్రమలుగా నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాలలో పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించే ఆవకాశం ఉంది.

Updated Date - 2020-08-08T17:24:13+05:30 IST