శానిటైజర్‌ మరణాలపై ముమ్మర దర్యాప్తు

ABN , First Publish Date - 2020-08-07T18:23:54+05:30 IST

కురిచేడులో శానిటైజర్‌ మరణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు..

శానిటైజర్‌ మరణాలపై ముమ్మర దర్యాప్తు

ఆధారాల సేకరణలో పోలీసులు


కురిచేడు(ప్రకాశం): కురిచేడులో శానిటైజర్‌ మరణాలపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. దీనిని తయారుచేసిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో సిట్‌ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది.  అక్కడ అ నుమానాస్పదంగా ఉన్న వివరాలు సిట్‌ బృందానికి చిక్కినట్లు తెలుస్తున్నది. దీనికితోడు జీరో వ్యాపారంతో కురిచేడుకు శానిటైజర్లు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నరసరావుపేట నుంచి వచ్చినట్లు సమాచారం. ఈక్ర మంలో కురిచేడులోని మెడికల్‌ దుకాణాల్లో సీసీ ఫుటేజీని పోలీసులు సేకరిస్తున్నారు. దీనిద్వారా ఎవరెవరు శానిటైజర్లు కొనుగోలు చేశారనే విష యం తెలుస్తుందని భావిస్తున్నారు.


ఒకే కంపెనీలో మూడు బ్రాండ్లు

నరసరావుపేట కేంద్రంగా తయారైన శానిటైజర్లలో ఒకే ఫార్మా కంపెనీలో మూడు రకాల బ్రాండ్లు తయారయినట్లు తెలుస్తున్నది. అక్కడ తనిఖీలు చేసిన ఎస్‌ఈబీ, సిట్‌ బృందం కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తున్నది. నరసరావుపేట నుంచి బిల్లులు లేకుండా శానిటైజర్లు వచ్చినట్లు సమాచారం. అక్కడి నుంచి కురి చేడుకు వచ్చిన శానిటైజర్ల మీద ఉన్న బ్యాచ్‌ నంబర్లకు, నరసరావుపేటలోని ఫార్మాలో తయా రైనట్లు చూపిన బిల్లుల్లోని బ్యాచ్‌ నంబర్లకు తే డా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈక్రమంలో జీరో వ్యాపారం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 


సీసీ ఫుటేజి సేకరణ

కురిచేడులోని మెడికల్‌ షాపులలో సీసీ ఫుటే జి సేకరణకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎవరెవరు శానిటైజర్లు కొనుగోలు చేశారు, ఏఏ కంపెనీల తీసుకెళ్లారనే విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చే యడానికి ఈ ఆధారం ఉపయోగపడుతుందని పోలీసుల భావిస్తున్నారు. అయితే ఇక్కడ పది మెడికల్‌ షాపులకు గాను మూడు షాపులలో సీ సీకెమెరాల సౌకర్యం ఉందని తెలుస్తున్నది. కొన్ని షాపుల ఎదురెదురుగా ఉన్న దుకాణాల నుంచి కూడా సీసీ ఫుటేజి తీసుకుంటే మరికొంత సమాచారం వచ్చే అవకాశాలున్నాయి. దర్యాప్తు రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


Updated Date - 2020-08-07T18:23:54+05:30 IST