Kuppamలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిల్..

ABN , First Publish Date - 2021-11-17T14:52:33+05:30 IST

కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో ఒక్కరంటే..

Kuppamలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నిల్..

చిత్తూరు : కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉండిపోయింది. ఎందుకో ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోడానికి సాహసించలేదు. పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.


ఇదిలా ఉంటే.. కుప్పం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మీడియాకు అనుమతి లేదు.. ఇక్కడికి రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు.. కెమెరా తీస్తున్న వీడియో గ్రాఫర్లపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాపై ఆంక్షలేంటి..? అంటూ పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఒక్కరంటే ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-17T14:52:33+05:30 IST