Abn logo
Jul 25 2021 @ 19:53PM

కుప్పం ప్రాంతంలో నకిలీ పోలీసులు హల్‌చల్

కుప్పం: కుప్పం ప్రాంతంలో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం ప్రాంతంలో నకిలీ పోలీస్ కిలాడీలు బరితెగించారు. పోలీసుల అవతారమెత్తిన కిలాడీలు రోడ్డున పోయే వాహనాలను దోచుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. కుప్పం మండలం పెద్దబంగారునత్తం వద్ద ఇన్నోవా వాహనం అపహరించారు. పోలీసులమంటూ ఇన్నోవా కారును దుండగులు అపహరించుకెళ్లారు. బోయకొండ గంగమ్మ దర్శననానికి వెళ్లి వస్తున్న తమిళనాడు వాసుల వాహనాన్ని అపహరించారు. ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

TAGS: kuppam POLICE