Kumbhakonam దుర్ఘటనకు 18 ఏళ్లు

ABN , First Publish Date - 2022-07-17T16:32:15+05:30 IST

తంజావూరు జిల్లా కుంభకోణం ప్రైవేటు పాఠశాల అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైన 94 మంది చిన్నారులకు శనివారం ఉదయం తల్లిదండ్రులు,

Kumbhakonam దుర్ఘటనకు 18 ఏళ్లు

                      - అగ్నికి ఆహుతైన చిన్నారులకు నివాళి


పెరంబూర్‌(చెన్నై), జూలై 16: తంజావూరు జిల్లా కుంభకోణం ప్రైవేటు పాఠశాల అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహుతైన 94 మంది చిన్నారులకు శనివారం ఉదయం తల్లిదండ్రులు, స్థానికులు నివాళులర్పించారు. కుంభకోణం కాశిరామన్‌ వీధిలోని శ్రీకృష్ణా ప్రైవేటు పాఠశాలలో 2004 జూలై 16న సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా చిన్నారులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన జరిగి ఇప్పటికి 18 యేళ్లు పూర్తయ్యాయి. అయితే పిన్న వయస్సులోనే తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు మాత్రం ఆ గర్భశోకం నుండి తేరుకోలేకపోతున్నారు. ఆ చిన్నారుల 18వ వర్థంతిని పురస్కరించుకుని కృష్ణా పాఠశాల వద్ద 94 మంది బాలబాలికల ఫొటోలతో బ్యానర్‌ను శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసి, పూల మాలలతో  అలంకరించారు. శనివారం ఉదయం ఆ చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు నచ్చిన ఆహారపదార్థాలు, పండ్లు, ఫలహారాలు, దుస్తులతో ఆ స్కూలు వరకు మౌనయాత్ర చేశారు. చిన్నారుల చిత్రపటాల బ్యానర్‌ దగ్గర తాము తీసుకువచ్చిన వాటిని ఉంచారు. ఆ తర్వాత తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు, నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు,రాజకీయ నాయకులు చిన్నారుల చిత్రపటాల వద్ద దీపాలను వెలిగించి నివాళులర్పించారు. 

Updated Date - 2022-07-17T16:32:15+05:30 IST