మహోన్నత వ్యక్తి కుమురం భీమ్‌

ABN , First Publish Date - 2020-11-01T08:49:10+05:30 IST

జల్‌, జమీన్‌, జంగల్‌ ఆదివాసీ, గిరిజనుల హక్కు అంటూ పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కుమురం భీమ్‌ అని పలువురు వక్తలు కొనియాడారు

మహోన్నత వ్యక్తి కుమురం భీమ్‌

కవాడిగూడ, అక్టోబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): జల్‌, జమీన్‌, జంగల్‌ ఆదివాసీ, గిరిజనుల హక్కు అంటూ పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కుమురం భీమ్‌ అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ గిరిజన ఐక్యవేదిక, తెలంగాణ వనవాసి కల్యాణ పరిషత్‌, తెలంగాణ ఆదివాసీ ఉద్యోగుల సం క్షేమ సాంస్కృతిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కుమురం భీమ్‌ వర్ధంతి కార్యక్రమాన్ని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కుము రం భీమ్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ దాసరి శ్రీనివాస్‌, సినీ నిర్మాత అల్లాణి శ్రీధర్‌, గిరిజన ఐక్యవేది క జాతీయ అధ్యక్షుడు వివేక్‌ వినాయక్‌, వనవాసి కల్యాణ పరిషత్‌ అధ్యక్షుడు హెచ్‌.కె.నాగు, ఏకలవ్య ఫౌండేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు వెంకటరమ ణ పాల్గొని కుమురం భీమ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2020-11-01T08:49:10+05:30 IST