శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి 60 మంది స్కూలు పిల్లల్ని కుల్గాం పోలీసులు, బలగాలు రక్షించినట్టు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. తీవ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో సౌత్ కశ్మీర్‌లోని యాష్ముజి ప్రాంతాన్ని బలగాలు చుట్టిముట్టి గాలింపు చర్యలు చేపట్టాయని, ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతమయ్యాడని పేర్కొంది. తీవ్రవాది ఎవరనేది గుర్తించాల్సి ఉందని తెలిపింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.