విరాట్ కోహ్లీలో ఉన్న అత్యుత్తమ లక్షణం అదే: కుల్దీప్ యాదవ్

ABN , First Publish Date - 2020-06-04T23:49:32+05:30 IST

2017లో టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ఎందరో యువ క్రికెటర్లు మద్దతు ఇచ్చిన

విరాట్ కోహ్లీలో ఉన్న అత్యుత్తమ లక్షణం అదే: కుల్దీప్ యాదవ్

2017లో టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. ఎందరో యువ క్రికెటర్లు మద్దతు ఇచ్చిన కోహ్లీ.. కుల్దీప్ యాదవ్.. యుజవేంద్ర చాహల్‌లకు వన్డేలు, టీ-20ల జట్టులో చోటు కల్పించి ఎంతో మద్దతు ఇఛ్చాడు. తద్వారా వారిద్దరూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్రను వేసుకున్నారు. అయితే విరాట్ కోహ్లీలోని అత్యుత్తమ లక్షణం ఏంటనే విషయాన్ని కుల్దీప్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


తాను టీంలోకి వచ్చిన కొత్తలో కోహ్లీ తనకు ఎంతో మద్దతు ఇఛ్చాడని అతను తెలిపాడు. కెప్టెన్‌గా తనతో కోహ్లీ ఎంతో నమ్మకం చూపించాడని అన్నాడు. ‘‘ఒక కెప్టెన్ మనల్ని నమ్మితే.. మైదానంలో మన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాము. సవాళ్లను ఎలా అధిగమించాలో కోహ్లీని చూసి నేర్చుకున్నాము. నేను జట్టులోకి వచ్చిన కొత్తలో అతను నాకు ఎంతో మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అతను నాకు మద్దతు ఇస్తాడు. మన ప్రతిభను అతను మెచ్చుకుంటాడు. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. అయితే విరాట్‌లోని అత్యుత్తమ లక్షణం ఏంటంటే.. అతను జట్టుని ఆటగాళ్లను సులభంగా అర్థం చేసుకుంటాడు. దీంతో మైదానంలో మన పని ఇంకా సులభం అవుతుంది’’ అని కుల్దీప్ అన్నాడు. 

Updated Date - 2020-06-04T23:49:32+05:30 IST