మిరుదొడ్డి, జూలై 4 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కూడవెళ్లి వాగు పరవళ్లు తొక్కుతున్నది. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాల్, లింగుపల్లి, మల్లుపల్లి, మోతె, రుద్రారం, భూంపల్లి, అక్బర్‌పేట చెక్‌డ్యాంలు పొంగిపొర్లాయి. చెక్‌డ్యాంల పైనుంచి నీరు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్బర్‌పేట వద్ద పొంగిపొర్లుతున్న కూడవెళ్లి వాగును చిత్రంలో చూడవచ్చు.