కూడన్‌కులంకు రష్యా నుంచి యురేనియం

ABN , First Publish Date - 2022-06-07T15:15:48+05:30 IST

తిరునల్వేలి జిల్లా కూడన్‌కులం అణువిద్యుత్‌ కేంద్రానికి రష్యా నుంచి రెండో విడత యురేనియం ఇంధన కడ్డీలు సరఫరా అయ్యాయి. ఈ అణువిద్యుత్‌ కేంద్రానికి ప్రతియేటా

కూడన్‌కులంకు రష్యా నుంచి యురేనియం

చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తిరునల్వేలి జిల్లా కూడన్‌కులం అణువిద్యుత్‌ కేంద్రానికి రష్యా నుంచి రెండో విడత యురేనియం ఇంధన కడ్డీలు సరఫరా అయ్యాయి. ఈ అణువిద్యుత్‌ కేంద్రానికి ప్రతియేటా యురేనియం ఇంధనపు కడ్డీలు సరఫరా చేయడానికి భారత ప్రభుత్వంతో రష్యా ప్రభుత్వం అరవైయేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు ప్రతియేటా కూడన్‌కులం అణువిద్యుత్‌ కేంద్రానికి యురేనియం సరఫరా చేస్తోంది. 2018 నుంచి ఈ ఇంధనపు కడ్డీలు సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాదికిగాను మే 27 తొలివిడతగా రష్యా నుంచి యురేనియం సరఫరా చేశారు. రెండో విడతగా రష్యా నుంచి యురేనియం కడ్డీలతో ఓ విమానం మదురై విమానాశ్రయానికి చేరుకుంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వాటిని కిందకు దింపి మూడు ట్రైలర్‌ లారీల్లో ఎక్కించి కూడన్‌కులం అణు విద్యుత్‌ కేంద్రానికి తరలించారు. ప్రతియేటా 163 యురేనియం ఇంధనపు కడ్డీలను ఉపయోగించి కూడన్‌కులంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు.

Updated Date - 2022-06-07T15:15:48+05:30 IST