ఆన్‌లైన్‌లో కూచిపూడి, భరతనాట్యం పోటీలు

ABN , First Publish Date - 2021-05-08T05:17:07+05:30 IST

పైడిమాంబ కళానికేతన్‌ ఆధ్యాత్మిక సేవా సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో కూచిపూడి, భరతనాట్యం పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం వ్యవస్థాపకుడు మహాపాత్రో ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో కూచిపూడి, భరతనాట్యం పోటీలు

విజయనగరం రూరల్‌: పైడిమాంబ కళానికేతన్‌ ఆధ్యాత్మిక సేవా సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో కూచిపూడి, భరతనాట్యం పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం వ్యవస్థాపకుడు మహాపాత్రో ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి, భరతనాట్యం ఏదైనా ఏడు నుంచి ఎనిమిది నిమిషాల నిడివి గల  వీడియోను  వాట్సాప్‌ ద్వారా ఈ నెల 21 ద్వారా పంపాలని కోరారు. ప్రథ మ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ 98853 87853 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ నెల 25 తరువాత సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామన్నారు.


Updated Date - 2021-05-08T05:17:07+05:30 IST