Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుబోటా... ఓపెన్ ఆఫర్ షెడ్యూల్‌ను ప్రకటన తర్వాత...

ముంబై : ఎస్కార్ట్స్ గ్రూపులో కీలక వాటాపై కుబోటా కార్పొరేషన్(జపాన్)...  ఓపెన్ ఆఫర్ షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత...  బలహీనమైన మార్కెట్‌లో సైతం ఎస్కార్ట్స్ షేర్లు మంచి జోష్‌ను  అందుకున్నాయి. శుక్రవారం ఇంట్రా-డేలో ఎస్కార్ట్స్ షేర్లు మూడు శాతం పెరిగి, రూ. 1,874 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ ప్రకటనలో ఓపెన్ ఆఫర్ మేనేజర్, టెండరింగ్ షేర్ల వ్యవధి జనవరి 11-24 తేదీల్లో జరగనుంది. మొన్న నవంబరు 18 న, ఎస్కార్ట్స్ బోర్డు 46.9 మిలియన్ల అదనపు షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్, ఓపెన్ ఆఫర్ ద్వారా ఒక్కో షేరుకు రూ.  రెండు వేల ధరతో కొనుగోలు చేస్తుందని, అలాగే నందాస్‌తో సహ-ప్రమోటర్‌గా చేరుతుందని ప్రకటించింది. ఎస్కార్ట్స్ గ్రూపులో కీలక వాటాపై జపాన్‌కు కుబోటా కార్పొరేషన్ కన్నేసింది. ఎస్కార్ట్ గ్రూప్ ఫ్యామిలీ అయిన నందాలతో సంస్థ చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. కొద్ది వాటాను తీసుకుని కంపెనీలో నియంత్రిత వాటా సాధించాలని జపాన్ సంస్థ భావిస్తున్నట్లు వినవస్తోంది. దేశంలో


భారీగా ఉన్న ట్రాక్టర్ మార్కెట్...

రానున్న కొన్నేళ్లలో ట్రాక్టర్ మార్కెట్ రెట్టింపవుతుందని అంచనా. ఈ క్రమలో... ట్రాక్టర్ కంపెనీలో కీలక వాటా సాధించి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎస్కార్ట్స్ యత్నిస్తోంది.  ఫరీదాబాద్‌కు చెందిన ఎస్కార్ట్ గ్రూప్‌లోని ప్రమోటర్లు తమకున్న మొత్తం వాటాలను విక్రయించడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్ నందాకు దీనిలో 36.59శాతం వాటా ఉంది. ఎస్కార్ట్ బెన్‌ఫిట్ అండ్ వెల్పేర్ ట్రస్ట్ ద్వారా 24.99 శాతం వాటాను కలిగి ఉన్నారు. తాజా చర్చల ప్రకారం నందా నుంచి 15 శాతం వరకు వాటా కొనుగోలు చేయాలని కుబోటా భావిస్తోంది. జపాన్ కంపెనీకి ఈ సంస్థలో ఇప్పటికే 9.9శాతం స్టేక్ ఉంది.

Advertisement
Advertisement