Oct 25 2021 @ 21:55PM

SACRED GAMES : ఆ సీన్ 7వ సారి షూట్ చేశాక... ఇక తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చాను...

‘శాక్రెడ్ గేమ్స్’... ఈ వెబ్ సిరీస్ తెలియని నెటిజన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంతగా సక్సెస్ అయింది అనురాగ్ కశ్యప్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే, ‘శాక్రెడ్ గేమ్స్’లో ప్రధాన పాత్ర పోషించింది నవాజుద్దీన్ సిద్ధీఖీ. నటన విషయంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అలాగే, నవాజుద్దీన్, అనురాగ్ కశ్యప్ కాంబినేషన్ కూడా ఆడియన్స్‌లో హైలీ ఫేమస్...


‘శాక్రెడ్ గేమ్స్’ రిలీజ్ తరువాత చాలా మందికి పరిచయం అయిన మరో పేరు కుబ్రా సెయిట్. ఆమె తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అయితే, ‘శాక్రెడ్ గేమ్స్’లో కీలక పాత్రల్లో ఒకటిగా నిలిచిన కుబ్రా క్యారెక్టర్ జనానికి బాగానే నచ్చింది కానీ... ఆమె మాత్రం కెమెరా ముందు చాలా కష్టపడాల్సి వచ్చిందట. ప్రధానంగా ఓ హాట్ బెడ్ రూమ్ సీన్ పిక్చరైజ్ చేస్తున్నప్పుడు కుబ్రా ఎంతో మానసిక ఒత్తిడికి, ఉద్వేగానికి లోనైందట. అంతే కాదు, నవాజుద్దీన్‌తో కుబ్రా చేసిన శృంగార సన్నివేశం కేవలం ఒక్కసారి చిత్రీకరించలేదట. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఏడు యాంగిల్స్‌లో షూట్ చేయాలనుకోవటంతో, ఏడు సార్లు అదే సెక్స్ సీన్, మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చిందంటూ కుబ్రా వివరించింది. చివరి సారి  సీన్ కంప్లీట్ చేశాక ‘కట్’ చెప్పగానే తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైందట. ఇక ఎంత మాత్రం ఏడుపు ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చేసిందట. అలా చాలా సేపు కుబ్రా ఏడూస్తూనే ఉండిపోయిందట... 


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘శాక్రెడ్ గేమ్స్’ స్టోరీ, టేకింగ్ పరంగానే కాకుండా హింస, సెక్స్ అండ్ న్యూడ్ సీన్స్ వల్ల కూడా ఆడియన్స్‌లో బాగా పాప్యులర్ అయింది. ఓటీటీలో సెన్సార్ ఇబ్బందులు ఉండకపోవటంతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ వీలైనంత బోల్డ్‌గా తీసే ప్రయత్నం చేశాడు...    

Bollywoodమరిన్ని...