కేయూ వెబ్‌సైట్‌ భేష్‌..

ABN , First Publish Date - 2022-05-13T05:50:34+05:30 IST

కేయూ వెబ్‌సైట్‌ భేష్‌..

కేయూ వెబ్‌సైట్‌ భేష్‌..

 నిరంతరం నూతన సమాచారం, ఫొటోలు అప్‌లోడ్‌

 విద్యార్థుల చేతిలో వర్సిటీ సమగ్ర సమాచారం

 టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న వీసీ, విభాగాధిపతులు

కేయూ క్యాంపస్‌, మే 12 : కాకతీయ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ నూతనత్వా న్ని సంతరించుకుంటోంది. వర్సిటీలో జరిగే కార్యక్రమాలన్నింటినీ అధికారిక వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ/లో నిరంతరం పొందుపరుస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో ఎప్పుడు ఏ పరీక్ష జరుగుతుంది.. ఏ పరీక్షలు.. ఏ సెంటర్‌లో నిర్వహిస్తారు.. సెంటర్ల వివరాలు.. కళాశాల చిరునామాలన్నీ వర్సి టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కేయూలో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొ ఫెసర్‌ తాటికొండ రమేశ్‌, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించే ప్రతీ సదస్సు కు సంబంధించిన సమాచారం, ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 

ఏప్రిల్‌ మాసంలో జరిగిన బాబుజగ్జీవన్‌రామ్‌, మహాత్మాపూలే, బీఆర్‌ అం బేద్కర్‌ జయంతి సదస్సుల వివరాలు, ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చే శారు. మహానీయుల జయంతి, వర్ధంతులతో పాటు విద్య, సామాజిక, సాం స్కృతిక అంశాలపై వర్సిటీలో జరిగే ప్రతీ అంశాన్ని వెబ్‌సైట్‌లో పెడుతున్నా రు. అలాగే మహిళా దినోత్సవం, రెడ్‌ రిబ్బన్‌క్లబ్‌ సదస్సు, సైన్స్‌ డే సెలబ్రేష న్స్‌, మాజీ ప్రధాని వీపీ నర్సింహరావు విజ్ఞాన పీఠం, కేయూ సోషియాలజీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ నూతన విద్యావిధానంపై అం తర్జాతీయ సదస్సు ఫొటోలతోపాటు వివరాలను పొందుపరిచారు. కేయూ తెలుగు విభాగం శాఖాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పంతంగి వెంకటేశ్వర్లు కన్వీనర్‌గా నిర్వహించిన ‘బీసీ అస్తిత్వ సాహిత్యం సమాలోచన’ అనే జాతీయ సదస్సు చిత్రాలను ప్రముఖంగా వెబ్‌సైట్‌లో ఉంచారు. 

పరీక్షల సమాచారం

కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌ లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. యూజీ, పీజీ, ఇంజనీరింగ్‌ విభాగాలకు వేర్వేరుగా రిజల్ట్‌, పరీక్షల ఆప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు నిరంతరం సమాచారాన్ని సమగ్రంగా అందిస్తున్నారు. కేయూ దూరవిద్యకేంద్రం పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ తెరిచారు. దీని ద్వారా దూరవిద్య కేంద్రం సమాచారాన్ని నిరంతరం అభ్యర్థు లకు చేరవేస్తున్నారు. 

చెల్లింపులు

వర్సిటీ పరీక్షల విభాగంలో ఏమైనా ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ఆన్‌ లైన్‌ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ నెంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకుని సర్టిఫికెట్లు పొం దేలా ఏర్పాట్లు చేశారు. వీటితో విద్యార్థులు వర్సిటీకి చెల్లించాల్సిన ఫీజులు, ఇతర బకాయు డబ్బులను నేరుగా వర్సిటీ రిజిస్ట్రార్‌ ఖాతాకు జమ చేసేలా గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే సౌకర్యాలను కల్పించారు. వర్సిటీ సీడీసీ,  అక డమిక్‌ అడిట్‌ అప్లియేటెడ్‌ కళాశాల నుంచి రావాల్సిన ఫీజులను కూడా ఆన్‌ లైన్‌లోనే చెల్లించుకునే ఏర్పాట్లు చేశారు. 

న్యూస్‌లెటర్‌

కాకతీయ యూనివర్సిటీ ప్రతీ ఆర్నెళ్లకోసారి వెలువరించిన న్యూస్‌లెటర్‌ (వర్సిటీ పత్రిక)ను కూడా వెబ్‌సైట్‌లోనే ఆప్‌లోడ్‌ చేస్తున్నారు. గతంలో ప్రచురించే విధానానికి స్వస్తిపలికి ఇప్పుడు సాంకేతిక పోకడను అందిపుచ్చు కున్నారు. వర్సిటీ డెవలప్‌మెంట్‌ వివరాలతో పాటు ఇతర అచీవ్‌మెంట్‌లను పత్రిక ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తారు. వీటితో పాటు డిజిటల్‌ లర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌, పెన్షనర్స్‌ పోర్టల్‌.. ఇలా అనేక అంశాలను వర్సిటీ వెబ్‌ సైట్‌లో నిత్యం అధునీకరిస్తున్నారు. గతంలో వర్సిటీ వెబ్‌సైట్‌కు అంత ప్రాధా న్యత ఇవ్వని వర్సిటీ అధికారులు.. ఇప్పుడూ తాజాగా అప్‌డేట్స్‌ పెడుతూ విద్యార్థులకు దిక్సూచిని చూపిస్తున్నారు. 

Read more