కేయూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాల వెల్లడి

ABN , First Publish Date - 2021-10-19T04:43:35+05:30 IST

కేయూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాల వెల్లడి

కేయూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాల వెల్లడి
ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ రమేశ్‌, రిజిస్ట్రార్‌ వెంకట్రామిరెడ్డి

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 18: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సీబీసీఎస్‌ ఆఖరు సెమిస్టర్‌ ఫలితాలు సోమవారం సాయంత్రం కేయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ విడుదల చేశారు. ఈ మేరకు కేయూ వైస్‌ చాన్స్‌లర్‌ వసతి గృహంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బైరు వెంకట్రామిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ పి.మల్లారెడ్డిలతో కలిసి ఫలితాల విడుదల చేసి వివరాలను వెల్లడించారు. డిగ్రీ అఖరు సెమిస్టర్‌ బీఎస్సీ, బీజడ్‌సీ, ఎంపీసీ, బీఏ లాంగ్వేజేస్‌, బీకాం, బీఏ, బీసీఏ, బీబీఏ కోర్సుల ఫలితాల వెల్లడించినట్లు పేర్కొన్నారు. బీఎస్సీ బీజడ్‌సీ ఉమెన్స్‌ 7224 మందికి గాను 6465 మంది(91.24) ఉత్తీర్ణత సాధించారని, అలాగే బీఎస్సీ ఎంపీసీలో 6711 మందికి గాను 6306 (94.88), బీఏ లాంగ్వేజే్‌సలో 9 మందికి 9 మంది ఉత్తీర్ణత సాధించారు (100), బీకాంలో 5617 మందికి గాను 5280మంది (95.36), బీఏలో 1878 మందికి గాను 1704 మంది (94.67), బీసీఏలో 68 మందికి గాను 67 మంది (98.53) మంది, బీబీఏలో 94 మందికి గాను 93(98.94) శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. 

అలాగే బీఎస్సీ బీజడ్‌సీ పురుషుల్లో 2076 మందికి గాను  1805 మంది (88.35)  బీఎస్సీ ఎంపీసీలో 4238 మందికి గాను 3972 మంది (93.72), బీఏ లాంగ్వేజ్‌లో ఐదుగురికి గాను ఐదుగురు ఉత్తీర్ణత(100) సాధించారు. బీకాంలో 4464 మందికి గాను 4203 మంది (95.05), బీఏలో 1771 మందికి గాను 1601 మంది (93.14), బీసీఏలో 66 మందికి గాను 65 మంది (98.48) బీబీఏలో 262 మందికి గాను 244 మంది (94.21)శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని కోర్సుల్లో ఉమెన్స్‌ 93.80 శాతం, పురుషుల్లో 93.28 శాతం ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. మొత్తంగా 93.61 శాతం ఉతీర్ణత సాధించారని  పేర్కొన్నారు. ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Updated Date - 2021-10-19T04:43:35+05:30 IST