నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్‌కి కేటీఆర్ బహిరంగలేఖ

ABN , First Publish Date - 2022-05-01T23:16:10+05:30 IST

తెలంగాణలో చేనేత రంగానికి ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ కేటాయింపుల చేస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.

నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్‌కి కేటీఆర్ బహిరంగలేఖ

హైదరాబాద్: తెలంగాణలో చేనేత రంగానికి ప్రభుత్వం భారీగా బడ్జెట్‌ కేటాయింపుల చేస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. నేతన్నలకు యార్న్‌ సబ్సిడీ ఇస్తున్న  ప్రభుత్వం కూడా మాదేనని అన్నారు. నేతన్నల  సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజెపి రాష్ట్ర ప్రసెడెంట్ బండి సంజయ్ చేసిన విమర్శకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఈమేరకు ఆయన నేతన్నల సంక్షేమంపై బండి సంజయ్‌కి బహిరంగలేఖ రాశారు.నేతన్నలకు బీమాను ఎత్తేసిన కేంద్రంపై బండి మాట్లాడాలని డిమాండ్ చేశారు.


కేంద్రం బీమా ఎత్తేస్తే... మేం ప్రత్యేక బీమా కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేతన్నలపై నిజమైన ప్రేమ బండికి ఉంటే పార్లమెంట్‌లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. చేనేతల కోసం కేంద్ర సంస్థలు తెలంగాణలో ఏర్పాటుకు మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. చేనేతపై తొలిసారి పన్ను వేసిన పాపపు ప్రభుత్వం బీజేపీదేనని మంత్రి కేటీఆర్ బహిరంగలేఖలో విమర్శించారు. 

Updated Date - 2022-05-01T23:16:10+05:30 IST