గేయ రచయిత కందికొండకు అండగా ఉంటాం: కేటీఆర్‌

సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు. కొంతకాలంగా కందికొండ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో చికిత్సకు తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కేటీఆర్‌ మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కందికొండ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆర్థికంగా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మోతీనగర్‌లో కందికొండ కుటుంబం ఉంటున్న ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మాతృక ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్‌కు ఓ లేఖ రాసిన సంగతి విధితమే! దీనిపై కేటీఆర్‌ స్పందించారు. గతంలో అండగా ఉన్నట్లే ఇప్పుడూ ఉంటామని ఆయన ట్విట్టర్‌లో వేదికగా తెలిపారు. 


Advertisement