రాత్రి 10గంటలకు ఓ బాలిక ట్వీట్.. అర్ధరాత్రి స్పందించిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2020-05-27T16:20:32+05:30 IST

‘‘కేటీఆర్‌ అంకుల్‌.. ఎలా ఉన్నారు.నా పేరు గాయత్రి. నేను దేవినగర్‌, రామకృష్ణపురం, సికింద్రాబాద్‌లో ఉంటాను. మాకు వాటర్‌ వచ్చి ఫైవ్‌ డేస్‌ అవుతోంది. గిన్నెలు తోముకోవడానికి,

రాత్రి 10గంటలకు ఓ బాలిక ట్వీట్.. అర్ధరాత్రి స్పందించిన మంత్రి కేటీఆర్

కేటీఆర్‌ అంకుల్‌.. ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదు..

సికింద్రాబాద్‌ నుంచి బాలిక ట్వీట్‌

అర్ధరాత్రి స్పందించిన మంత్రి

తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు


హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ‘‘కేటీఆర్‌ అంకుల్‌.. ఎలా ఉన్నారు.నా పేరు గాయత్రి. నేను దేవినగర్‌, రామకృష్ణపురం, సికింద్రాబాద్‌లో ఉంటాను. మాకు వాటర్‌ వచ్చి ఫైవ్‌ డేస్‌ అవుతోంది. గిన్నెలు తోముకోవడానికి, దుస్తులు ఉతకడానికి, స్నానం చేయడానికి చాలా ప్రాబ్లమ్‌ అవుతోంది. మా ప్రాబ్లమ్‌ను సీరియ్‌సగా తీసుకుని మాకు రెగ్యులర్‌గా వాటర్‌ వచ్చేలాగా చూడమని కేసీఆర్‌ తాతగారికి చెప్పగలరు ప్లీజ్‌..’’ ...అంటూ సికింద్రాబాద్‌ దేవినగర్‌కు చెందిన బాలిక సోమవారం రాత్రి 10 గంటలకు చేసిన ట్వీట్‌కు అర్ధరాత్రి 12 గంటలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కచ్చితంగా వాటర్‌బోర్డు చర్యలు తీసుకుంటుందని, స్థానిక జనరల్‌ మేనేజర్‌ వెంటనే సందర్శించి సమస్యను పరిష్కరించాలని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ఆదేశాలిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ఉదయం దేవినగర్‌లోని బాలిక ఇంటికి చేరుకుని నీటి సరఫరా చేశారు. ఇక నుంచి నీటి సరఫరా క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతూ బాలికతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌కు జోడించారు.



Updated Date - 2020-05-27T16:20:32+05:30 IST