Abn logo
Feb 14 2020 @ 19:28PM

ఏప్రిల్‌ 2నుంచి టీఎస్ బీపాస్ అమలు చేస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్: మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని, నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలు అసాధారణ, గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదన్నారు. ప్రతీ పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలన్నారు. ఎక్కడికి వెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, ఏప్రిల్‌ 2నుంచి టీఎస్ బీపాస్ అమలు చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. పైసా కూడా లంచం లేకుండా ఇంటి అనుమతులు ఇవ్వాలని, 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని కేటీఆర్‌ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement