తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-07-25T06:38:45+05:30 IST

తెలంగాణ ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి తెలియజేయడంలో మంత్రి కేటీఆర్‌ పాత్ర ఎనలేనిదని విద్యుత్‌ మంత్రి గుం టకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తన సొంత నిధులతో 10మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను శనివా రం పంపిణీచేసి మాట్లాడారు.

తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి కేటీఆర్‌
అర్వపల్లి మండలంలో జాతీయ రహదారి వెంట మొక్క నాటుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

కేటీఆర్‌ చొరవతోనే ప్రపంచ దేశాలనుంచి పరిశ్రమల రాక

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి 


సూర్యాపేటటౌన్‌/అర్వపల్లి/తుంగతుర్తి/నూతనకల్‌, జూలై 24: తెలంగాణ ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి తెలియజేయడంలో మంత్రి కేటీఆర్‌ పాత్ర ఎనలేనిదని విద్యుత్‌ మంత్రి గుం టకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తన సొంత నిధులతో 10మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను శనివా రం పంపిణీచేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజలకు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధిలో మంత్రి కేటీఆర్‌ తనవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగడంలేదన్నారు. ప్రపంచ దేశాల నుంచి పరిశ్రమలు రాష్ర్టానికి రావడానికి కేటీఆర్‌ చూపుతున్న చొరవ వెలకట్టలేనిదన్నారు. అదేవిధంగా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం, నకిరేకల్‌-తానంచర్ల జాతీయ రహదారి వెంట 40 కిలోమీటర్ల మేర 60వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం 25 మంది దివ్యాంగులకు ఎలక్ర్టిక్‌ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, నూతనకల్‌ మండలం బిక్కుమల్ల గ్రామ శివారులో జాతీయ రహదారికి ఇరువైపులా మంత్రి మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కూమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికయుగేంధర్‌రావు,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. 


మొక్కలే జీవకోటికి ప్రాణాధారం : ఎమ్మెల్యే కంచర్ల

రామగిరి: మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మునిసిపల్‌ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీలో శనివారం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హరితహారంలో భాగంగా పట్టణంలో ఇప్పటికే లక్షలాది మెక్కలు నాటామన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా బాధ్యత తీసుకోవాలన్నారు. జీకే అన్నారం రోడ్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో, ఆర్టీవో ఆఫీస్‌ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్‌ శ్రీనివాసులు, ఎంజీ యూనివర్సిటీ సెనెట్‌ సభ్యుడు బోయపల్లి కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ పాశం సంపత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలకుంట్ల నాగరత్నంరాజు, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌, పిల్లి రామరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:38:45+05:30 IST