ట్విట్టర్‌ అభ్యర్థనకు స్పందించిన కేటీఆర్‌

ABN , First Publish Date - 2021-06-15T06:29:30+05:30 IST

మండలంలోని ఓబులాపూర్‌కు చెందిన గల్ఫ్‌ కార్మికుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతని కు టుంబ పరిస్థితులపై పలువురు సోమవారం ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని అభ్యర్థించారు.

ట్విట్టర్‌ అభ్యర్థనకు స్పందించిన కేటీఆర్‌
సాయం అందిస్తున్న ఎమ్మెల్యే

ఫతండ్రిని కోల్పోయిన చిన్నారులకు రూ.లక్ష సాయం

మల్యాల, జూన్‌ 14: మండలంలోని ఓబులాపూర్‌కు చెందిన గల్ఫ్‌ కార్మికుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతని కు టుంబ పరిస్థితులపై పలువురు సోమవారం ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని అభ్యర్థించారు. దీంతో వెంటనే స్పందించి న మంత్రి కేటీఆర్‌ వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. ఎమ్మెల్యే రవిశంకర్‌కు కూడా తగు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ ద్వారాసూచించారు. ఓబులాపూర్‌కు చెందిన గల్ఫ్‌ కార్మికుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో వారి పరిస్థితిని కొందరు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.  దీం తో వెంటనే కలెక్టర్‌, ఎమ్మెల్యేకు తగు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు. ఎమ్మెల్యే సోమవారం వారికి రూ.లక్ష నగదు అందజేసి, కేటీఆర్‌ సూచనల మేరకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, చిన్నారులకు గురు కులంలో సీటు ఇప్పించనున్నట్లు హామినిచ్చారు. కేటీఆర్‌, ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా బాదిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొండపల్కుల రామ్మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌ స్థానిక సర్పంచి పొన్నం సరోజనమల్లేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T06:29:30+05:30 IST