Rahul Gandhiకి కేటీఆర్‌ కౌంటర్‌

ABN , First Publish Date - 2022-05-07T22:19:15+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్‌ (KTR) కౌంటరిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

Rahul Gandhiకి కేటీఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్‌ (KTR) కౌంటరిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది టెన్ జన్‌పథ్‌ కాదు.. తెలంగాణ జనపథం అని పేర్కొన్నారు. ఒక్క చాన్స్‌ కాదు.. ప్రజలు పది చాన్స్‌లు ఇచ్చారని తెలపారు. 5 దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దివాలాకోరు వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కుంభకోణాల్లో కూరుకుపోయిన దౌర్భాగ్య పార్టీ అని కేటీఆర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోమని కాంగ్రెస్ నేతలను ఎవరు అడిగారని నిలదీశారు. అమేథీలో దిక్కులేదని కేరళ వెళ్లి అక్కడ గెలిచారని ఎద్దేశాచేశారు. గాంధీభవన్‌ను గాడ్సేకు రాహుల్‌ (Rahul) అప్పజెప్పారని తప్పుబట్టారు. రాహుల్ అభం శుభం తెలియని అజ్ఞాని అని కేటీఆర్‌ ఎద్దేశాచేశారు.

Read more