KTR Birthday: యూకేలో ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-07-25T16:01:41+05:30 IST

ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్" భాగంగా అదే పేరుతో ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ కార్యవ

KTR Birthday: యూకేలో ఘనంగా కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

ఎన్నారై డెస్క్: ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి, తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో  ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు "గిఫ్ట్ ఏ స్మైల్" భాగంగా అదే పేరుతో ఎన్నారై టీఆర్ఎస్ యూకే శాఖ కార్యవర్గ సభ్యులు యూకే NHSలోని బ్లడ్ బ్యాంకుకు రక్తదానం ఇచ్చారు. NRI టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ దుసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ దేశ నలుమూలల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు.NRI TRS ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అశోక్ దూసరి మాట్లాడుతూ.. కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. తెలంగాణ సమాజం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాముఖ్యతను చాటి చెబుతూ పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్‌కు కేటీఆర్, పార్టీ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు.



అనంతరం అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని, అందరి సూచనలను తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు. ఎటువంటి సలహాలు సందేశాలు ఉన్నా వ్యక్తిగతంగా గానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. ఎన్నారై TRS ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ.. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటి రంగంలో అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశానికే తలమానికంగా నిలపడంలో కేటీఆర్ కృషి మరువలేనిదన్నారు. చివరిగా ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడారు. వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ప్రవాస బిడ్డా కేటీఆర్ వెంటే ఉంటారన్నారు. హాజరైన కార్యవర్గ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అద్యక్షుడు అశోక్ దూసరి, ఎన్నారై టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైజర్ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్, కార్యదర్శులు సత్య చిలుముల, సృజ న్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ సతీష్ రెడ్డి, గణేష్, నిఖిల్ పాల్గొన్నారు.


Updated Date - 2022-07-25T16:01:41+05:30 IST